15, డిసెంబర్ 2012, శనివారం

my village


Monday,december, 2012

నా ఊరు



నేనెళ్ళిపోయానన్న బాధేమో
ఊరి మధ్య రావిచెట్టు
ఆకురాల్చేసింది

తన
అవసరం లేదనుకుందేమో
రచ్చబండ బీటలేసింది

గుడి
మెట్టు,చెరువు గట్టు
నాకోసమే ఎదురుచూస్తున్నట్టున్నాయి

జామచెట్టుకేసిన
ఊయల
కిర్రు చప్పుళ్ళ ఊసేలేదు

ఇక
రాననుకున్నారో ఏమో
అయినవాళ్ళు కొందరు
చెప్పకుండానే దాటిపోయారు

ఇపుడా
ఊరు
నా చరిత్రకి
శిధిల సాక్ష్యంగా మాత్రమే మిగిలింది

తిరిగి వెళ్ళకపోయినా బాగుండును
జ్ఞాపకాల్లో అయినా సజీవంగా వుండేది నా ఊరు


తెలుసుకో నేస్తం



చిరునవ్వు విలువెంతో

అందుకొన్న అతిధినడుగు

సూటి మాట పదునెంతో

గాయపడిన మనసునడుగు

జారిన కన్నీటి బరువెంతో

తేలికపడిన గుండెనడుగు

చివరికి మిగిలేదేమిటో

కాలు నిలవని కాలాన్నడుగు


హేమంతపు ఉదయం


వేకువ ఝాములో గుడిలో మేల్కొలుపు గీతాలు
దోసిట్లో నింపుకోమంటూ పారిజాతాల పిలుపులు


ఒకపక్క ధనుర్మాసపు తొలిపొద్దు
ఆవిష్కరించే అందమైన చిత్రాలు
మరోపక్క మాయచేసే మంచు తెరల మధ్య

చలిమంటల వెచ్చదనాలు

ముచ్చటగా ముగ్గులతో నవ్వే ముంగిళ్ళు
మనసునిండుగా హరిదాసు దీవెనలు

ఎంత పొద్దెక్కినా

సూరీడు విడవని బాణాలెన్నో మా ఊరిలో
చలిగిలికి ఇంకా
విచ్చుకోని వర్ణాలెన్నో మా తోటలో

ఆలోచనలు



ఏ ఏకాంతక్షణంలోనో
నన్నడగకుండా వచ్చేసి
పారిజాతాల తోటలోని నేస్తాలదగ్గరకి తీసుకుపోతాయి

ఒక్కోసారి సమూహం నుండి వేరుచేస్తూ
నన్నునాకు దగ్గర చేస్తాయి

చిరునవ్వులు పూయిస్తాయి
చెమరింతలు తెప్పిస్తాయి
కారణాలు వెతికిస్తాయి
కాలక్షేపం చేయిస్తాయి
మరుక్షణంలోనే నేనేమీకానట్టు
వదిలేసి వెళ్ళిపోతాయి

తమ్ముడు


ఎన్ని అద్భుతాలు పంచుకున్నామో కదా మనమిద్దరం
అమ్మఒడి,ఆవకాయ పెరుగన్నం,పిడిగుద్దులు,తాతయ్య కుర్చి....

ఎంత దూరముంటే ఏమిటి మన మధ్య
పిల్లతెమ్మెరలా జ్ఞాపకాలు తాకిపోవడానికి ఆ దూరం ఏం భారంఅవుతుందని?

ఏక్షణమో నీపిలుపు వినిపిస్తుంది లీలగా
హఠాత్తుగా కళ్ళముందు నీ రూపం మెదులుతుంది
ఏ పార్కులోనో అన్నా చెళ్ళెళ్ళో,అక్కాతమ్ముళ్ళో నవ్వుతూ కనిపిస్తారు
మరుక్షణం నువ్వు నేను మన అరుగుమీద ఆడుతుంటాము

మరిన్ని జ్ఞాపకాలు చుట్టుముట్టేస్తాయి
తెలియకుండానే పెదవుల్ని చిరునవ్వులు పలకరిస్తాయి
గుండె బరువెక్కడం మాత్రం తెలుస్తూనే వుంటుంది

గాయపడిన నమ్మకాలు


నావని గర్వం గా చెప్పుకున్నవి
ఇప్పుడు నన్నే కొత్తగా చూస్తుంటే,
నువ్వెవరని ప్రశ్నిస్తుంటే......


తలచుకుని తలచుకుని మురిసిన జ్ఞాపకాలు,
ఉద్వేగపు క్షణాలు...అన్నీ
నాది పిచ్చితనమంటూ గేలిచేస్తుంటే...


గతపు ఆనవాళ్ళు గుండెల్లో మాత్రం మిగుల్చుకుని
అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను


ఈక్షణంతో అందమయిన జ్ఞాపకాలన్నీ
ఒక్కసారిగా చెరిగిపోయాయి
నమ్మకాలన్నీ భ్రమలుగా మిగిలిపోయాయి



నువ్వురాక ఎవ్వరున్నా
ఒంటరవుతాను ఎందుకో
నిన్నుచూస్తే నన్నునేనే
మరచిపోతాను ఎందుకో
కనులముందుకు నేరుగా
నేరాను అంటావు ఎందుకో
కలతనిదురలొ కలలాగా
వెనువెంటవస్తావు ఎందుకో
ఎందుకో ఓ ఓ..

నిదురనే మరచి నా కన్నులే
అలసినా వేచెనెందుకో
తలపులో నిలచి నీ రూపం
గుండెనే తట్టెనెందుకో
ఈలోకం వెలివేసినా
నీకోసం ఎదిరించనా
ఈలోకం వెలివేసినా
నీకోసం ఎదిరించనా
చెలియా చెలియా నువ్వుగా వలచి నన్నిలా వదిలావెందుకో ఎందుకో....

చినుకులా తడిపి నీస్నేహం
మెరుపులా వెళ్ళెనెందుకో
కెరటమై ఎగసి నీప్రేమ
నురగలా కరిగెనెందుకో
ఈ దూరం బాధించినా
ఎడబాటే కలిగించినా
ఏగాయం నువుచేసినా

రేపటి కానుక



నిజాన్ని అద్దంలోంచి చూస్తూ
అబద్దంలో
హాయిగా తిరిగేస్తున్నాం

ఆకలి కేకలు వింటూ
అయ్యోపాపమంటూ
నిట్టూర్చి వదిలేస్తున్నాం

సుఖాన్ని పెంచుకుని
సంతోషాన్ని కుదించుకుని
మరమనుషుల్లా మిగిలిపోతున్నాం

విలువమారే కాగితాన్ని చూపిస్తూ
మాకేం తక్కువంటూ
ఎదురు ప్రశ్నలు వేస్తున్నాం

ఎంతో విజ్ఞానం సంపాదించి
అంతటి విశ్వాన్ని చేధించి
పచ్చటి దారిలో ముళ్ళ తివాచీలేస్తున్నాం
రేపటి తరానికి ఎడారుల్ని కానుకిస్తున్నాం
పూవల్లే నినుచూడనా

Tuesday, August 01, 2006

ప్రేమ

రెండు హృదయాల మూగ భాష ప్రేమ
నాలుగు కన్నుల ఎదురుచూపు ప్రేమ
ఎన్నో తెలియని భావాల బాధ ప్రేమ
ఛిలిపిదనాల తీయనైన‌ అనుభవం ప్రేమ
మాట్లాడగలిగే మౌనం ప్రేమ
యుగాల నిరీక్షణే ప్రేమ
మనసైన‌ వాడిని రెప్పల వెనుక దాచేది ప్రేమ
మరణాన్ని సైతం ఆహ్వానించేది ప్రేమ
ఆరాధించేది ప్రేమ
ఆరాటపడేది ప్రేమ
అంతు తెలియనిది ప్రేమ
అంతం లేనిది ప్రేమ
ఇది నాకు తెలిసిన ప్రేమ
నేను అక్షర భాష్యం చెప్పగలిగిన ప్రేమ
కాని...భాష తెలియని భావాలెన్నో

ప్రేమన్న రెండు అక్షరాల పదం లోమనసా మనసా మాటలే మరచి మౌనమే నేర్చినావెందుకో ఎందుకో....

కన్నీటి లేఖ



నేస్తం
నీ కన్నీటి ని చూసి
నా గుండె నిండి పోయింది
నువ్వు చిందించిన కన్నీరు
నాకు భరోసానిచ్చింది

నేస్తం... నీకు గుర్తుందా...
ఆ రోజు నువ్వు
నానిగాడి తో పంపిన ఆ ఉత్తరం...

అందులో కన్నీటి చుక్కలతో
అలుక్కుపోయిన అక్షరాలు
చెప్పేసాయి మన స్నేహం గాఢతని

ఆక్షణం
నీ కన్నీరు నాకెంత ధైర్యాన్నిచ్చిందని?
నాకోసం బాధపడే హ్రుదయం
ఒకటంటూ ఉందని నా మనసెంత గర్వపడిందని?

ఇంతకీ ..
నా కనుల కాగితం పైన
కన్నిటి చిత్రాలు

జీవితం


ఈ రంగుల లోకంలో
నావన్నీ నల్లని అనుభవాలు
కనుల కాగితం పై
కలల కావ్యాలకి బదులు కన్నీటి చిత్రాలు...

వదిలి పోయిన సున్నిత త్వం
కౌగిలించుకున్న కర్కశత్వం
నేను కాదనుకున్న కలివిడితనం
నన్ను కాదనుకున్న ఆనందం

నాలొని నన్ను చంపుకుంటూ
నన్ను నేను మార్చుకుంటూ....వెళ్ళాల్సిన
తీరం కనిపించని దూరం లో గమ్యం
కన్నవాళ్ళను వదిలి
స్నేహాలను మరచి
డాలర్ల లో వెతుక్కొవాల్సిన సంతోషం

నేనంటూ మిగిలి లేని
నాదంటూ ఏమిలేని
నాకంటూ ఎవరూ వుండకూడని జీవితం

పెళ్ళి కి అర్ధం ఇప్పుడు తెలిసింది
"నువ్వు కాని నువ్వు
నీది కాని జీవితం" నీకు కనిపిస్తున్నాయా మరి?

నందననామ సంవత్సరమా!!


ప్రియమైన నందన నామ సంవత్సరమా...
అప్పుడే వచ్చేసావా??
ఖరనామ సంవత్సరం నీకు చెప్పిందో లేదో తన అనుభవాలు, అనుభూతులు...

ఎప్పటిలాగే గుర్తుపట్టలేనంత వేగంగా రాజకీయాల్లో రంగులు మారిపోతున్నాయి..
కుంభకోణాలకి కొత్త నిర్వచనాలనిచ్చే పనిలో తలమునకలైపోయారు మా నాయకులు...

ప్రతి చిన్న వార్తకి పడుతూ లేస్తూ కంగారు పెడుతున్నది సెన్సెక్స్ సూచీ..
మొన్ననే విడుదలైన బడ్జెట్ లో అంకెల గారడీ అర్థం కాక, లాభ నష్టాలు
బేరీజు వేసుకుంటున్నాడు మధ్యతరగతి మానవుడు..

ప్రపంచ కప్ గెలిచిన సంబరం ఎప్పుడో ఆవిరైపోయింది...
ఎవరెవరు ఎప్పుడు రిటైర్ కావాలో నిర్ధారించే పనిలో నిమగ్నమైపోయాడు సగటు క్రీఢాభిమాని..
ఇంకా మూడు ఫైట్లు, ఆరు పాటల సినిమాలతో
ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు కొందరు దర్శకులు..

ప్రతిరోజు పేపర్ లో వార్తలు చదివినప్పుడల్లా కాస్త నిట్టూర్చి, కొంత చర్చించి
తర్వాత అన్నీ మర్చిపోయి తమ పనుల్లో మునిగిపోతున్నారు కొందరు...
మార్పు కావాలంటే ఏదో ప్రయత్నం అవసరమని
తమవంతు కృషి చేస్తున్నారు ఇంకొందరు...

ఇవన్నీ విని కంగారుపడకు...మాకెప్పుడో అలవాటైపోయాయి..
తొందరలోనే నీక్కూడా అలవాటైపోతాయిలే...

గుమ్మంలో నిలబెట్టి మాట్లాడానని నాపై కోపగించుకోకు..
ఇప్పుడే ఖరనామ సంవత్సరం మిగిల్చిన ఙ్నాపకాలని పదిలంగా మనసు అరల్లో భద్రపరిచాం..
ఇంకెందుకు ఆలస్యం??
రాబోతున్న సంవత్సరపు దారిలో కుమ్మరించు నువ్వు తెచ్చిన కొత్త అనుభవాల మూటని..
కొంగొత్త అశలతో మరో సంవత్సరం ఆస్వాదించడానికి ఎప్పుడో సిద్ధమయ్యాం మేమందరం..

koodali

నీ వెచ్చని కౌగిలి

రత్న రాసులు వద్దు..
మణిమాణిక్యాలు వద్దు..
సిరిసంపదలు వద్దు..
భోగభాగ్యాలు వద్దు..
నగలు వద్దు..
నగదు వద్దు..
విందులు వద్దు..
వినోదాలు వద్దు..
విలాసాలు వద్దు..
విహారాలు వద్దు..
నువ్వు చాలు..
నీ నవ్వు చాలు..
నీ మనసు చాలు..
నీ మమత చాలు..
నీ ప్రేమ చాలు..
నీ అనురాగం చాలు..
నీ నోటి మాట చాలు..
నీ చేతి స్పర్శ చాలు..
నీ చల్లని ఒడి చాలు..
నీ వెచ్చని కౌగిలి చాలు..

2 కామెంట్‌లు: